24.7 C
Hyderabad
Monday, August 3, 2026

జీఎస్టీ రద్దు ఎఐఐఇఎ పోరాట ఫలితమే

Must read

📰 Generate e-Paper Clip

  • కామ్రేడ్ డి.ఎస్.రఘు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీమా పాలసీలపై జిఎస్టీ రద్దు చేస్తు కేంద్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (అఖిల భారత బీమా ఉద్యోగులు సంఘం) పోరాట ఫలితమే అని ఆ సంఘం సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.ఎస్.రఘు అన్నారు. ఎ.ఐ.ఐ.ఇ.ఎ. నిజామాబాద్, బోదన్, ఆర్మూర్ ఎల్.ఐ.సి.శాఖల సాధారణ సర్వ సభ్య సమావేశం నిజామాబాద్ శాఖ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి బీమా పాలసీలపై జిఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తులు ఇవ్వడంతోపాటు ఎన్నో ఆందోళనలు చేయడంతో పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు స్పందించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు.దాంతో కేంద్ర ప్రభుత్వం తలోగ్గి బీమా పాలసీలపై జిఎస్టీని రద్దు చేస్తుందని అంటున్నారు.ఎల్.ఐ.సి.లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యగులందరికిపాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీమా,బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల, రైతాంగా, కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో రఘుతో పాటు డివిజన్ అధ్యక్షులు గుణశేఖర్, కోశాధికారి జావీద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల సంయుక్త కార్యదర్శులు రాజేష్ శ్రావణ్,ఒగ్గు శివ, డివిజన్ నాయకులు నవీన్ దాస్, అనీల్,మూడు బ్రాంచీల అధ్యక్షులు పి.ఎస్.సామ్రాట్, బి.మురళి, రాకేష్, కార్యదర్శులు డి.సురేష్, మారుతి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article