24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తడపాకల్‌లో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండలంలోని తడపాకల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘాల కోసం నిర్మించనున్న నూతన భవనానికి శనివారం గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సమాఖ్య సంఘాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.10 లక్షల వ్యయంతో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోలపు రాజు, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article