24 C
Hyderabad
Sunday, August 2, 2026

చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన రుద్రూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన సట్టి సాయిలు (50) రుద్రూర్ గ్రామ చెరువులో శనివారం చేపలు పట్టేందుకు వెళ్లి చేపల వల కాళ్ళకు చుట్టుకుని ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.

More articles

Latest article