24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజరెడ్డి అధ్యక్షతన శనివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన శివన్నోల్ల శివకుమార్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎంపికపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article