26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆసీస్ పై భారత్ ఘన విజయం

Must read

📰 Generate e-Paper Clip

  • ఫైనల్ కు టీం ఇండియా

 

వెబ్  డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఫైనల్ కు చేరుకుంది. మంగళవారం ఆసీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో 4వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264  పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కంగారూలపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. విరాట్ కోహ్లీ (84, 98బంతుల్లో 5ఫోర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ (45, 62బంతుల్లో 3ఫోర్లు) మరోసారి మంచి ప్రదర్శన చేశాడు. కేఎల్ రాహుల్ (42 నాటౌట్, 34 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్ లు), హార్ధిక్ పాండ్య (28, 24 బంతుల్లో 1ఫోర్, 3 సిక్స్ లు) రాణించారు.

More articles

Latest article