24.8 C
Hyderabad
Friday, July 31, 2026

ఘనంగా ఈరవత్రి జన్మదిన వేడుకలు 

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ గవర్నమెంట్ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను గురువారం భీంగల్ మండల కేంద్రంలోని ఎల్. జె ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. బాల్కొండ కానస్టెన్సీ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో రక్తధాన శిభిరం నిర్వహించి రక్త దానం చేశారు. ఈ సందర్బంగా అనిల్ అభిమానులు 85 మంది రక్తధానం చేశారు. ఈ సందర్బంగా నాగేంద్రబాబు ఈరవత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ అన్న మరెన్నో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని,రాజకీయంలో మరెన్నో ఉన్నత శిఖరాలను ఆదిరోయించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన యువకులకు, శిబిరం నిర్వహణకు సహకరించిన రెడ్ రోజ్ సంస్థ నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల మండల యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ బద్దం అవినాష్, కిసాన్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ చిన్నరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు శ్యామ్ రాజ్, సుంకరి సురేష్, నితీష్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోర్డినేటర్ దోంకంటి రాజేష్, కానిస్టెన్సీ సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీరామ్ రవి, భీమ్ గల్ పట్టణ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిచ్చెన మహేష్, కార్యకర్తలు అజయ్, మనోజ్, రఘు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article