. . . అత్మహత్య యత్నం చేస్తుందని పోలిస్ లకు పోన్
. . . మొబైల్ ట్రాక్ ద్వార కాపాడిన పోలిస్ లు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
తాను అత్మహత్య చేసుకుంటున్నాని తండ్రికి పోన్ లో సమాచారం అందించింది వివాహిత. అసహయ స్థితిలో అ తండ్రి పోలిస్ లకు పోన్ చేయడంతో అ వివాహిత ను పోన్ లో ట్రాక్ చేసి అత్మహత్య చేసుకోకుండా పొలిస్ లు కాపాడారు. ఈ సంఘటన గురువారం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన తోమాటి ప్రియాంకకు ఐదేళ్ల క్రితం బాన్సువాడకు చెందిన సంతోష్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రియాంక కొంతకాలంగా భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ప్రియాంక గురువారం తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో వెంటనే తండ్రి బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మొబైల్ నంబర్ ద్వారా ట్రాక్ చేయగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో లోకేషన్ గుర్తించారు. స్థానిక 1 వటౌన్ పోలిస్ లు, రైల్వే ఎస్ఐ సాయిరెడ్డికి సమాచారం అందించారు. దానితో రెండు పోలిస్ టింలు రైల్వే ట్రాక్ వద్ధ ఉన్న ప్రియాంకను రక్షించి కుటుంబీకులకు అప్పగించారు.
