27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మై భారత్ జిల్లా సెలక్షన్ కమిటీ నామినిగా పిల్లి శ్రీకాంత్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యుడు, భాజపా కార్యకర్త పిల్లి శ్రీకాంత్ మై భారత్ నిజామాబాద్ జిల్లా కమిటీ నామినిగా నియమిస్తు మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ దేవేంద్ర వ్యాస్ ఉత్తర్వులు జారీ చేశారు. నవీపేట్ మండల కేంద్ర నివాసుడైనా శ్రీకాంత్ విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం భాజపా యువ మోర్చా లో సైతం వివిధ స్థాయిలలో పని చేశారు. తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాల నుండి లా పట్టభద్రులయి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి జెఎసి లో తన ఉద్యమ సహచరులతో పాల్గొన్నారు. ప్రస్తుతం భాజపా ఐటి సెల్ భాద్యునిగా ఉన్నారు. తన నియమాకానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, శాసన సభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి లకు పిల్లి శ్రీకాంత్ ధన్యవాదములు తెలిపారు.

. . . మై భారత్ పోర్టల్

మై భారత్ పోర్టల్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 31, 2023 న ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ యువజన మంత్రిత్వ శాఖలో అనుబంధంగా కొనసాగుతుంది. యువతలో సృజనాత్మకతను వెలికి తీయడం, దేశంలో ఉపాధి అవకాశలను వినియోగించుకునే విదంగా చూడటం, దేశ ప్రగతి పథంలో భాగస్వాములను చేయడం, మెగా ఈవేంట్ లలో పాల్గొనే విదంగా ప్రేరేపించడం తదితరాలను మై భారత్ అవగాహన కల్పిస్తుంది. వికసిత్ భారత్ లో భాగంగానే యువత మిలితం అయి ఉండాలని కోరుతుంది. సంకల్ప్ అభియాన్ అనే నినాదమే యువతలో ఉండాలని నేర్పుతుంది. 2026 ఆగస్టు, 2 న నషా ముక్త్ ప్లేడ్జ్ ను దేశవ్యాప్తంగా నిర్వాహంచడానికి ఏర్పాట్లు చేస్తోంది మై భారత్.

More articles

Latest article