. . . కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతన్న ల ఆవేదన
కమ్మర్ పల్లి, బతుకమ్మ :
మండలం లో గురువారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.. కమ్మర్ పల్లి, బషీరాబాద్ సెంటర్ లలో టార్పాలిన్ కప్పి తగు జాగ్రత్తలు తీసుకున్న రైతన్నలకు ఈదురు గాలులు, భారీ వర్షాలకు టార్పాలిన్స్ కొట్టుకొని పోయి, కళ్ళాల్లోనే ధాన్యం తడిసి పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇంత నష్టం జరిగేది కాదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా కొనుగోలు జరగడం లేదని కొనుగోలు కేంద్రాల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షం పాలు అయిందన్నారు. ఇంకా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు రోడ్డెక్కి పెద్ద ఉద్యమం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భీంగల్, సిరికొండ, ఆర్మూర్ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసాయి.

