26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పార్ములా -ఈ కార్ లో అవినీతి లేనిది ఉన్నట్లు సృష్టించిన కుట్రలో కాంగ్రెస్ భాజపా భాగస్వాములని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. కేసీఆర్ సకల జనులను కూడగట్టుకుని తెలంగాణ రాష్ట్రం సాధించినందుకా, పదేళ్ల తెలంగాణ ప్రగతిని ప్రజల ముంగిట ఉంచినందుకా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషించినందుకా కాంగ్రెస్ భాజపా కలిసికట్టుగా కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్ములా -ఈ కార్ అనే దానితో ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు కేటీఆర్ మలిపిండని ఆయన తెలిపారు. అసలు అందులో అవినీతే లేదని, లేనిదానిని ఉన్నట్లు చూపడంలో కాంగ్రెస్ భాజపా ల కణికట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పార్ములా ఈ తో రాష్ట్ర ఖజానాకు లాభమే చేకూరిందని, హైదరాబాద్ కీర్తిప్రతిష్టలు పెరిగాయని ఆయన వివరించారు. హైదరాబాద్ ను ఐటి రంగంలో శిఖరాగ్రానికి చేర్చిందే కేటీఆర్ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రoలో భారాస ను ఎదగానీయరాదనే కుట్రకోణమే ఉన్నదని ఆరోపించారు. కేటీఆర్ ను రాజకీయంగా బద్నామ్ చేసే రాజకీయ కక్ష సాధింపులో భాగమే కాంగ్రెస్ భాజపా ల అక్రమ కలయికతో రాష్ట్ర గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చినట్లు మధుసుధన్ రావు అన్నారు.

More articles

Latest article