కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే గవర్నర్ అనుమతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  పార్ములా -ఈ కార్ లో అవినీతి లేనిది ఉన్నట్లు సృష్టించిన కుట్రలో కాంగ్రెస్ భాజపా భాగస్వాములని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు. కేసీఆర్ సకల జనులను కూడగట్టుకుని తెలంగాణ రాష్ట్రం సాధించినందుకా, పదేళ్ల తెలంగాణ ప్రగతిని ప్రజల ముంగిట ఉంచినందుకా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషించినందుకా కాంగ్రెస్ భాజపా కలిసికట్టుగా కుతంత్రాలకు...