30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎన్ఎస్యూఐ తెలంగాణ వర్శిటీ అధ్యక్షుడు బాణోత్ సాగర్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వర్శిటీలోని స్థానిక గ్రంథాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.. విశ్వవిద్యాలయానికి నూతనంగా ఇంజీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కలశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ వర్శిటీకి సైతం ఇంజనీరింగ్ కలశాల ఏర్పాటు విషయమై స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారని, ఈ మేరకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. అటు మరో వైపు తెలంగాణలో ఇటీవల 9 విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం తో పాటు తాజాగా, సంక్షేమ వసతి గృహాల్లో మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడు హరీష్, ప్రధాన కార్యదర్శి నవీన్, పవన్, కృష్ణ, గోపాల్, దేవేందర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article