27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉన్నత విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది

Must read

📰 Generate e-Paper Clip

. కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తాం

. తెయూ వీసికి వినతిపత్రం అందజేసిన ప్రైవేట్ కళాశాల మేనేజ్ మెంట్ అసోసియేషన్

డిచ్ పల్లి, బతుకమ్మ: ఉన్నత విద్యను రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంతోపాటు మంత్రులు, అధికారులు వినే ప్రయత్నం చేయడం లేదని ప్రైవేట్ కళాశాల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.  దసరా లోపు ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నుంచి కళాశాలల నిరవధి బంద్ పాటిస్తున్నామని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ర్టార్ కు వినతిపత్రం అందజేశారు. ఫీజు బకాయిలను విడుదల చేయనప్పటికీ ఇన్ని రోజులు నెట్టకొచ్చామని, ఇప్పుడు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, భవనాల అద్దె చెల్లించలేక కళాశాలల ను మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. తప్పని పరిస్థితుల్లో డిగ్రీ పరీక్షల బహిష్కరణ, కళాశాలల నిరవధి బంద్ పాటిస్తున్నామన్నారు. రిజిస్ర్టార్ ను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు అంబోజి హరిప్రసాద్, జి సంజీవ్ రెడ్డి, నరాల సుధాకర్ తదితరులున్నారు.

 

More articles

Latest article