27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పరిశోధనల వైపు వెళ్లి మంచి భవిష్యత్తును పొందాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కళాశాల ప్రిన్సిపాల్ డా. లక్ష్మీ నారాయణ

 

. . . ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుక

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

విద్యార్థులు పరిశోధనల వైపు వెళ్లి మంచి భవిష్యత్తును పొందాల్సిందిగా ఎల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డా.లక్ష్మీ నారాయణ తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ సివి రామన్ ఫోటోకు నివాళులర్పించారు. అనంతరం విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆధునిక విజ్ఞాన శాస్త్రం, దాని లోపల ప్రత్యేకతలను, నైపుణ్యాలను వివరించారు. విజ్ఞాన దినోత్సవ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులను ప్రిన్సిపల్, అధ్యాపకులు బహుమతులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి అరుణ్ కుమార్ సెన్సార్ అద్దాలను తయారుచేసి కండ్లు లేనివారు ఈ సెన్సార్ అద్దాలను ఉపయోగించడo వల్ల ముందు అడ్డొచ్చేటువంటి వస్తువులు కానీ ఏవైనా సులభంగా సెన్సార్ సౌండ్ వల్ల తెలుసుకోవచ్చని తన ప్రయోగం ద్వారా వివరించాడు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, ఐ కే సి సమన్వయకర్త డాక్టర్ వి శంకరయ్య, ఎన్.ఎస్.ఎస్ విభాగం అధిపతులు చంద్రకాంత్, రాణి, డాక్టర్ గోదావరి, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దు రాజు, శశిధర్, సంతోష్, సురేష్ రెడ్డి, సంగీత, కీర్తి స్వప్న, దశరథ్, మహమూద్ అధ్యాపకేతరులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Go towards research and get a better future.

 

More articles

Latest article