27.7 C
Hyderabad

అత్యాచారం కేసులో ఒకరికి జీవితఖైదు

Life imprisonment for one in rape case

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  :

మహిళపై అత్యాచారం చేసిన ఆరెపల్లి సాయిలుకు జీవితఖైదు విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు.తీర్పులోని వివరాలు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళతో ఆరేపల్లి సాయిలుకు వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. బతుకు తెరువు కోసం ఆమె భర్త దుబాయి దేశంకు వెళ్లగా పిల్లలతో కలిసి ఉండేది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని ఆసరాగా తీసుకున్న సాయిలు ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపినట్లు తెలిపారు. ఆమె పిర్యాదుతో ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించిన ఏర్గట్ల పోలీసులు తదనంతర నేర విచారణను భీంగల్ సిఐకు అప్పగించారు. బాధిత మహిళ సాక్ష్యాన్ని ఇతరుల సాక్ష్యాలను నమోదు చేసి పూర్తి నేర విచారణ అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణ నిర్వహించిన జడ్జి దుర్గా ప్రసాద్ ముద్దాయి సాయిలు పై అత్యాచార అభియోగం రుజువు అయినట్లు నిర్దారించారు. మహిళపై అత్యాచారం చేసినందున జీవిత కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

More articles

Latest article