24.1 C
Hyderabad
Monday, August 3, 2026

గుండె వైద్య సేవల దిశలో జిజిహెచ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యాంజియోగ్రామ్ టెస్ట్ సక్సెస్

 

. . . జిజిహెచ్ హుద్రోగ వైద్య నిపుణుల అరుదైన ఘనత

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఏడంతస్థుల మేడలో ఇప్పుడు గుండె వైద్యం కోసం అడుగులు పడుతున్నాయి. నిజామాబాద్ జిజిహెచ్ లో సూపర్ స్పెషాల్టి వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి అధికారులు పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో కోట్ల రూపాయల తో ఏర్పాటు చేసిన క్యాథలాబ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ హాస్పిటల్  నిజామాబాద్‌లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు యాంజియోగ్రామ్ ప్రధానమైంది. ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రధానంగా కార్డియాక్ సేవలు అందించే కార్పొరేట్ ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ కు దాదాపు రూ.35 వేల నుంచి 50 వేల ఫీజు వసూలు చేస్తారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్యాథలాబ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత  గుండె వైద్య నిపుణులు సేవలందిస్తున్న సమయంలో యాంజియోగ్రామ్ విజయవంతంగా పూర్తి కావడం మంచి పరిణామం. పేదలకు కార్డియాక్ సేవలకు కీలకమైన యాంజియోగ్రామ్ నిజామాబాద్ జిజిహెచ్ లో ఉచితంగా అందనుంది.. గుండెనొప్పులకు వైద్యంకు ప్రైవేట్ కు వెళ్లి లక్షల రూపాయలు అప్పులు చేయాల్సిన పనిలేకుండా ధర్మసుపత్రిలో ఉచిత వైద్యం అందుబాటులోకి రానుంది. నిజామాబాద్ జిజిహెచ్ లో క్యాథలాబ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో సింకోపల్ అటాక్స్‌ తో బాధపడుతున్న యాదయ్య అనే పేషెంట్ కు శనివారం ఉదయం యాంజియోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. కార్డియాలజీ  వైద్య బృందం సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని వైధ్యులు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు. యాదయ్యకు యాంజియోగ్రామ్ విజయవంతంగా పూర్తి కావడంతో అతని కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

క్యాథలాబ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం : జిజిహెచ్ ఇంచార్జీ సూపరింటేండేంట్ డా.నాగమోహన్

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హుద్రోగులకు వైద్య సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే సూపర్ స్పెషాల్టి వైద్యం అందించేందుకు కలిగిన పరిమిత వనరులతోనే ప్రయత్నాలు చేస్తున్నాం. కోట్ల రూపాయాలతో ఏర్పాటు చేసిన క్యాథలాబ్ సేవలలో యాంజీయోగ్రాం తొలిమెట్టు. జిజిహెచ్ కు కార్డియాలజీస్ట్ పోస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్ పై ముగ్గురు వైధ్యులను నియమాకం జరిగింది. వారి ద్వారా జిజిహెచ్ లో గుండె వైద్య సేవలను అందించుటకు ఏర్పాట్లు చేస్తున్నాం…

 

GGH in the direction of cardiac medical services

More articles

Latest article