రుద్రూర్, బతుకమ్మ: బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈనెల 11, 12, 13 తేదీలలో గావ్ ఛలో, బస్తి ఛలో అభియాన్ కార్యక్రమంలో ఆదివారం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ రుద్రూర్ గ్రామంలో పలు కార్యక్రమలల్లో పాల్గొన్నారు. గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ అంగడి బజార్ లోని అంబేద్కర్ విగ్రహాన్ని కడగడం జరిగింది. అనంతరం రుద్రూర్ గోశాలలోని గోవులను శుభ్రం చేస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గోశాలలో నిర్వహించడం జరిగింది. వాక్స్ బోర్డు సవరణ బిల్ గురుంచి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, కృష్ణం రాజు, మండల సీనియర్ నాయకులు కటిక రాజారామ్,తోట శంకర్, పార్వతీ మురళి, తోట శ్రీనివాస్, కిషన్ మోర్చా అధ్యక్షులు గంగాధర్ బీసీ మోర్చా అధ్యక్షులు సతీష్ పవర్, కుమ్మరి గణేష్, బేగరి వినోద్ కుమార్, సాయికుమార్, బండ్ల గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
