- నియామక పత్రాన్ని అందజేసిన పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రారెడ్డి
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులుగా గంట బాలకృష్ణ గౌడ్ నియామకమాయ్యారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్ది, మాజీ అధ్యక్షులు పొన్నాల తిరుపతి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బంధారాపు లక్ష్మా రెడ్ది లు నియామక పత్రాన్ని బాలకృష్ణ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బిజెపి పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.రానున్న స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలిపే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు
