- ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సమాజంలో జరుగే నేరాల నియంత్రణ ఒక్క పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని దానికి ప్రజల సహకారం అవసరమని, సిసి కెమెరాలు నేరాలను తగ్గించడంలో సహాయ పడుతాయని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నగర శివారులోని ఖానాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఒక కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అన్నారు. కెమెరాలు పెట్టడానికి సహకరించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఎస్ హెచ్ ఓ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
