26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ  రాష్ట్ర ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :                                                                                                                                                                    

తెలంగాణ  రాష్ట్ర ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండాను అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఆర్మూర్ డివిజన్ కేంద్రం  కార్యాలయం వద్ద శనివారం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి కార్మికుల శ్రేయస్సుకై 327 చేస్తున్న కృషిని మరువలేమని, ఇకముందు కూడా కార్మికుల పక్షాన పోరాడుతూ కార్మికుల శ్రేయస్సుకై కృషి చేస్తామని అన్నారు. గత 70 వసంతాల నుంచి యూనియన్ ఏకతాటి పె నడిపిస్తున్న జాతీయ ఐఎన్ టియూసి అధ్యక్షులు జి.సంజీవరెడ్డి కి, యూనియన్ సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ కి, ఆర్మూర్ డివిజన్ కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఎన్ చందర్ నాయక్,  ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, యూనియన్ సభ్యులు, ఆర్టీషన్ కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article