తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి పట్టణంలో గంగమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి వేర్వేరు రూపాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. బుధవారం బైరాగి వేషంలో అమ్మవారు కనిపించనున్నారు. మే 13న అంగరంగ వైభవంగా జాతర జరగనుంది. మే 14న ఉదయం 4 గంటలకు అమ్మవారి విశ్వరూప దర్శనం ఇవ్వనుంది. చెంప నరికే కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

