25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

యువతిపై గ్యాంగ్ రేప్ ?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోలీసులు అదుపులో పలువురు యువకులు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ధర్పల్లి మండలం లో దుబ్బాక గ్రామ శివారులోని నల్లగుట్ట ప్రాంతంలో ఓ యువతిపై స్థానికంగా ఒక తాండాకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మోపాల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి తన స్నేహితురాలితో కలిసి శనివారం సాయంత్రం ధర్పల్లి మండలంలోని ఓక తాండాకు చెందిన పరిచయమున్న యువకులతో వెళ్లింది. అక్కడ యువతిని ఆమె స్నేహితురాలిని ఎర్టిగా కార్ లో నల్లగుట్ట ఆటవి శివారు ప్రాంతానికి తీసుకు వచ్చిన యువకులు మద్యం తాగించి ఒక యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరో యువతి అక్కడి నుంచి తప్పించుకుని రోడ్డు వెంట పరుగెత్తుకుంటూ వెళ్లగా సదరు గ్రామానికి చెందిన వ్యక్తి తారసపడటం అఘాయిత్యం గురించి తెలపింది. సదరు గ్రామస్థులు అక్కడికి తరలిరాగా యువకులు పరారీ అయ్యారు. భాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. యువతి స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

More articles

Latest article