29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఎల్బీసీ ఘటనపై రేవంత్ కు రాహుల్ ఫోన్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు రెస్క్యూ బందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈఘటనకు సంబంధించి జరుగుతున్న సహాయక చర్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిముషాలపాటు మాట్లాడుకున్నారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలను రేవంత్  వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలం నుంచి ఎన్ఆర్డీఎఫ్, ఎస్ఆర్డీఎఫ్ రెస్క్యూ స్క్వాడ్‌లతో పాటు అవసరమైన సహాయక చర్యలను, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తీరును రాహుల్ గాంధీకి సీఎం వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలతో పాటు,ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాహుల్ సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర  పర్యవేక్షణను రాహుల్ గాంధీ అభినందించారు.

More articles

Latest article