. . . దొంగ బండ్లను కొనుగోలు చేస్తున్న వారు కూడా పట్టివేత
. . . 17 పల్సర్ బైక్ లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో బైక్ లను దొంగలించే అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. దొంగతనం చేసిన బైక్ లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వారిని అరెస్టు చేసి 17 పల్సర్ బైక్ లను రికవరి చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. బుదవారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో సీపీ విలేఖరులతో మాట్లాడుతూ…. మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ కు చెందిన షేక్ అర్బజ్, నాందేడ్ జిల్లా దేగ్లూర్ నాకాకు చెందిన షేక్ ఆరిబ్, మోసంబి క మల్లా మహ బూబ్ కాలనీకి చెందిన షేక్ రెహమాన్ లు ముఠాగా ఏర్పడి ఖరీదైన పల్సర్ బైక్ లను దొంగిలించేవారు. వారు నిర్మల్ జిల్లాలలోని బాసర, ముధోల్, భైంసా, తానూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో, నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నవీపేట్, మాక్లూర్, రెంజల్, వర్ని తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ లను చోరి చేశారు. షేక్ అర్బజ్ అలియాస్ మాయ షేక్, ఇమ్రాన్ అలియాస్అ బూ అలియాస్ షేక్ సమీర్ అనువారు గతంలో బైక్, చైన్స్ స్నాచింగ్ దొంగతనాలు చేయగా నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. వీరిపై గతంలో 10 కేసులు కలవు. దర్యాప్తులో భాగంగా గత రెండు సంవత్సరాలు గా షేక్ అర్బజ్, షేక్ ఇమ్రాన్, షేక్ ఆరిబ్, షేక్ రెహమాన్ అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో గల వివిద మండలాలలో పల్సర్ బైక్ లు లక్ష్యంగా దొంగతనాలు చేయడం ప్రారంబించినారు. ఈ నలుగురు కలిసి దొంగతనం చేసినటువంటి సుమారు 17 బైకులను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్ కు చెందిన షేక్ అర్బాజ్, రెహమత్ సోం, కాంబ్లే మనోజ్, షేర్ షాదుల్ షేక్ అను వారు తక్కువ ధరకు కొనడం జరుగుతున్నది. వీరి వద్ద 17 బైక్లను రికవరీ చేయడం జరిగింది.

మంగళవారం సాయంత్రం నవీపేట్ మండలంలో అయ్యప్ప టెంపుల్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా పోలీస్ వారిని చూసి పారిపోతుండగా షేక్ అర్బాజ్, షేక్ అరిబ్ లు పట్టుబడ్డారు. షేక్ రహమాన్ పరారీలో ఉన్నారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు సమాచారంతో గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రెండు జిల్లాలకు చెందిన 15 కేసులను చేధించారు. బైక్ దొంగల వద్ద తక్కువ ధరకు బైక్ లను కొనుగోలు చేసిన షేక్ అర్బాజ్ రహమత్, సోన్ కాంబ్లే మనోజ్ శంకర్, షెర్ ఆలీ, షాదుల్ అలిలను అరెస్టు చేసి వారి వద్ద 17 బైక్ లను రికవరీ చేశారు. బాసరకు చెందిన అవేజ్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్నవారి కోసం వేట కొనసాగుతుందని సిపి తెలిపారు. అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్టు చేయడంలో నిజామాబాద్ ఎసిపీ ప్రకాష్ యాదవ్, సీసీఎస్ ఎసీపీ మస్తాన్ వలీ, నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్, నవిపేట్ ఎస్ ఐ శ్రీకాంత్ లను అభినందించారు.

