- 8ఫీట్లకన్న పెద్ద గణేష్ లకు జాన్కంపేట్ మీదుగా అనుమతించడం లేదు
- గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ ప్రకటించిన పోలిస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ ను ప్రకటించారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అగస్టు 27న ప్రతిష్టాపన జరుపుకున్న గణనాథుల నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుందని దానికోసం విగ్రహాల సైజ్ ల ఆధారంగా 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు ఈ దిగువ విధంగా వెళ్ల వలెను అని రూట్ మ్యాప్ లో తెలిపారు. బాసర గోదావరిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటే 8 ఫీట్లకంటే తక్కువ సైజ్ గత విగ్రహాలకు అనుమతిస్తామని తెలిపారు. జాన్కంపేట్ నందు బ్రాడ్ గేజ్ రైలు హై టెన్షన్ రైల్వే లైన్ గలదు కావున ఆ రూటు నందు 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు గల వాహనాలు వెళ్ళడం నిషేధించడం జరిగిందన్నారు. గణేష్ విగ్రహం 8 ఫీట్ లోపు గల విగ్రహాలను పాత రూటు ప్రకారంగా అనగా నెహ్రూపార్కు, అర్సాపల్లి, జాన్కంపేట్, నవిపేట్ మీదుగా బాసర కు వెళ్ల వచ్చును అని తెలిపారు. గణేష్ విగ్రహం 8 ఫీట్ల కంటె ఎత్తుగల విగ్రహాలను పాత నిజామాబాద్ ఏరియా వారు గాజుల పేట, శివాజీ నగర్, గోల్ హన్మాన్, అంగడి బజార్, ఎల్లమ్మ గుట్ట, పూలాంగ్, రాజారాజేంద్ర చౌరస్తా చుట్టు ప్రాంతాలు, సాయినగర్, గాయిత్రి నగర్, కోటగల్లి, హౌసింగ్ బోర్డు, బోర్గామ్, న్యాల్కల్, నాగారాం మొదలగు కాలనీల వారు కొత్త రూట్ లో వెళ్లాలని తెలిపారు. ఎనిమిది ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తుగల విగ్రహలను పూలాంగ్ – ఎన్.టి.ఆర్ చౌరస్తా – రైల్వే స్టేషన్ – బస్ స్టేషన్ – రైల్వే ఓవర్ బ్రిడ్జి – శివాజీ చౌక్ – దుబ్బా – జి.జి కాలేజీ చౌరస్తా – బైపాస్ రోడ్డు – చౌరస్తా – ముబారక్ నగర్ – మాణిక్ బండార్ – దాస్ నగర్ – మాక్లూర్ – నందిపేట్ ( ఉమ్మెడ గ్రామ సరిహద్దులో గల గోదావరి బ్రిడ్జికి వెల్లవచ్చు ) లేదా – నవిపేట్ – బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్ళ వచ్చును అని తెలిపారు. శోభాయాత్ర నిమజ్జనం ఆలస్యం లేకుండా ప్రశాంతంగా విజయవంతంగా ఆహ్లాద కరమైన భక్తి వాతావరణంలో జరగటానికి అన్ని గణేష్ మండలి నిర్వహకులు భక్తులు ప్రజలు అనునిత్యం సంబంధిత పోలీస్ వారికి సహకరించాలని కమీషనర్ సాయి చైతన్య కోరారు.
