నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని ఎల్లమ్మ గుట్ట బొబ్బిలి గల్లీలో గల శ్రీ విశ్వజ్యోతి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తోట శారద లక్ష్మణ్, శ్రీ విశ్వజ్యోతి యూత్ సభ్యులు బొబ్బిలి మధుమోహన్, శ్రీనివాస్, బి.మహిపాల్, జి.కృష్ణగీత్, బి.శ్రావణ్, బి.మహేష్, బి.వినేశ్, నిఖిల్, జి.సాయి కుమార్, రాజు, నవీన్ పాల్గొన్నారు.
