29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య

 

హైదరాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద విధానం అవలంబిస్తుందన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అధికారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ  రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగంలోనీ 243 డి6 ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అధికారం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా కొత్త , కొత్త డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు. ఆర్డినెన్సు పై ఇంతవరకు గవర్నర్ ను రేవంత్ రెడ్డి కలవలేదని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి ఇంతవరకు తీసుకోలేదని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శిస్తున్నాడు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిపక్షాల పైన , బిజెపి ,  ఇతర నాయకుల పైన బురద జల్లడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున ఒక కార్యచరణ సిద్ధం చేసుకొని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి పని చేయాలన్నారు. గ్లోబల్స్ ప్రచారం,  డైవర్ట్ పాలిటిక్స్ కాకుండా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు మేధావుల, అఖిలపక్ష సమావేశం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయలేదన్నారు.  కేంద్ర ప్రభుత్వంపై ఇతర పార్టీల పై బురద జల్లుతూ రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నాడని మండిపడ్డారు.  కవిత నిస్వార్ధంగా బీసీల కోసం దీక్ష చేస్తున్నదని, కవిత దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. 40 , 50 యేండ్ల నుంచి బిసిల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు చేశానన్నారు. బీసీల కోసం కవిత చేస్తున్న ఉద్యమం బీసీల పట్ల మరింత బలాన్ని చేకూరుస్తుందని, ఎటువంటి సందేహం లేదని అన్నారు. కవిత పట్టుదలతో దీక్ష చేస్తుందని,  ఆమె దీక్ష చేయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

More articles

Latest article