25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 28 ,29 తేదీలలో జరిగే పి డి ఎస్ యూ నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని  నిజామాబాద్ పి డి ఎస్ యూ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్,డి.సాయి కిరణ్ లు కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట పి డి ఎస్ యూ జిల్లా మహాసభల పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యూ) 50 ఏండ్లుగా విద్యార్థి సమస్యలపై పోరాడి అనేక విజయాలు సాధించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు విద్యారంగనికి బడ్జెట్ లో  తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను నిర్విన్యం చేస్తున్నారని అన్నారు. విద్యా వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని, విద్యలో అశాస్త్రీయంగా అనేక మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ , కషాయికరణ విద్యను వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి విద్య రంగ సమస్యల చర్చలకై ఆర్మూర్ పట్టణంలో  23వ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని,జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు, మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజాసంఘాల నాయకులు  అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.  మహాసభలకు పివో డబ్ల్యూ జాతీయ నాయకురాలు  సంధ్య, ప్రొఫెసర్ లింబాద్రి, వినాయక్ రెడ్డి, పిట్ల సరితలు , ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్శులు పస్క నర్సయ్య, పోచయ్య, ఇఫ్టు జిల్లా కార్యదర్శి దాసు, మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్,పి డి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ,నాగరాజులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నగర సహాయ కార్యదర్శి మనోజ్, కమిటీ సభ్యులు ప్రసాద్, భవాని,నాయకులు ప్రవీణ,రమ్య,శ్రీజ  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article