31.4 C
Hyderabad

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగం పేరుతో మోసం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం ఇస్తానని ఓ మహిళను నమ్మించి ఓ వ్యక్తి రూ.40వేలు(ఫోన్ పే) వసూలు చేసి మోసం చేశాడు. బాధితురాలు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. నగరంలోని ముజాహిద్ నగర్ కు రజియా సుల్తానా (24) యువతి నర్సింగ్ పూర్తి చేసి  ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది.  వైద్యారోగ్యశాఖ ఉద్యోగి ఒకరి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని, రూ.లక్షా 50వేలు ఇవ్వాలని నమ్మించాడు. తమది పేద కుటుంబమని, అంత మొత్తం డబ్బు ఇవ్వలేనని సుల్తానా చెప్పడంతో ఆమె నుంచి రూ.40వేలు వసూలు చేసి ముఖం చాటేశాడు. తనకు జరిగిన మోసంపై బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు స్వప్నతో కలిసి సుల్తానా ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు.

More articles

Latest article