27.2 C
Hyderabad

ఏకచక్రేశ్వరాలయంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పూజలు

Must read

📰 Generate e-Paper Clip

 బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయాన్ని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఆలయంలో అన్నదాన సత్రం, మండపం, ప్రహరీ నిర్మాణానికి దేవాదాయశాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని కమిటీ అధ్యక్షుడు హరికాంత్ చారి, సభ్యులు కమల భూమేశ్  అసిస్టెంట్ కమిషనర్ ను కోరగా  ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్ గుప్తా, ఎండోమెంట్ ఇన్ స్పెక్టర్ కమల, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article