29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగనోట్ల కేసులో మాజీ ప్రజా ప్రతినిధి..?

Must read

📰 Generate e-Paper Clip

  • రేపో మాపో అరెస్టుకు రంగం సిద్ధం
  • ఇది వరకే విచారణకు పిలిచిన పొలీసులు

 కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల 500 వందల దొంగనోట్ల తయారీ చలామణి చేసే ముఠా గుట్టు రట్టు చేశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారీ దొంగనోట్లు చలామణి చేస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.5 లక్షల మేర నకిలీ కరెన్సీని బిచ్కుం దలో చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ చలామణిలో కీలకపాత్ర ఎవరు పోషించారనే దానిపై పోలీసులు ఆరా తీయడం

Former public representative in the robbery case..?

ప్రారంభించారు. ఇందులో భాగంగా బిచ్కుంద మండలంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి అతడి అనుచరుడిని పోలీసులు అనుమానించి విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రజా ప్రతినిధిని విచారణకు పిలిచిన విషయాన్ని ఓ పోలీస్ అధికారి ధ్రువీకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈనెల 14న ఆరుగురుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 60 లక్షల నకిలీ 500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల చలామణితో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Former public representative in the robbery case..?

More articles

Latest article