23.7 C
Hyderabad

ఘనంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కేక్ కట్ చేసి బాణా సంచా కాల్చి బిగాల కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట కమాన్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే కోటగల్లి లో చింతకాయల రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాయకులు, డివిజన్ ఇంచార్జులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రముఖ గోల్ హనుమాన్ దేవాలయం లో గోల్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ నీలగిరి రాజు, సీనియర్ నాయకులు గోబ్బురి కృష్ణ రెడ్డి, ఉల్లెంగా భూపతి, డీజే సన్నీ, నీలగిరి చందు, గైని మహేష్ ఆధ్వర్యంలో అర్చన, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, మాజీ న్యూడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Former MLA Bigala Ganesh's birthday celebrated in grand style

More articles

Latest article