26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ లో చేరిన 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

51 డివిజన్ మాజీ కార్పొరేటర్ బాలకిషన్ శుక్రవారం బీజేపీ లో చేరారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాల కిషన్ మాట్లాడుతూ దేశ ప్రధాని సంక్షేమ పథకాలు ఆకర్షితులైన నేను భారతీయ జనతా పార్టీ లో చేరానని, జరగబోయే ఇందురు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడమే కాకుండా మన ఇందూరు మన మేయర్ అనే నినాదం తో ముందుకు వెళుతూ భారతీయ జనతా పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తానని అన్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ అడుగుజాడల్లో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పిల్లి శ్రీకాంత్, ముందడ పవన్, హరీష్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article