- జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జానపదం అంటే జనపదం అని, ప్రస్తుత కాలంలో జాన పదానికి ఎంతో ఆదరణ పెరిగిందని, నిజామాబాద్ లో కళాకారుల కళ అద్భుతమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో న్యూ అంబేద్కర్ భవన్ లో నిజాంబాద్ సంస్కృతి కళావేదిక అధ్యక్షులు సిర్ప లింగం ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు 2025 ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కళాకారులు, పాడిన పాటలు, చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సందర్భంగా జిల్లా జడ్జి భరత లక్ష్మి మాట్లాడుతూ.. జనాలనుంచి పుట్టినది జానపదమని, జానపదం ఎక్కడో ఆకాశం నుంచి రాలేదని, మనిషి జీవన విధానంలో నుంచి పుట్టిందని అన్నారు. ఎప్పటికీ పాటకి ఎంతో ఆదరణ ఉంటుందన్నారు. ప్రస్తుతం మిగితా పాటలన్నీటి కంటే జానపదానికి ఎక్కువగా ఆదరణ ఉంటుందని అన్నారు. సామాన్య జనానికి సైతం జానపదం చేరువవుతుందన్నారు. పాట ప్రభావితం చూపిస్తుందని, పాటతో మనుషులు కాదు, పశుపక్షాదులు కూడా సంగీతానికి మైమరిపింప చేసేదే జానపదం అన్నారు. పాట అంటేనే శ్రమించిన మనిషికి, అలసిపోయిన మనిషికి, ఆవేదనలను మనిషికి, ఆనందాన్ని అందించే ప్రక్రియ అన్నారు. ఆవేదన నుంచి, సంతోషం నుంచి, సమస్య నుంచి ఎక్కడి నుంచి అయినా పాట పుట్టవచ్చని అన్నారు. అన్ని స్థాయిల ప్రజలను దనిక, పేద అని తేడా లేకుండా అందరిని రంజింప చేసేది జానపదం అన్నారు. ప్రతి ఒక్కరికీ అనుభూతిని సమాన పాళ్లలో అందిస్తుందని, అందరినీ ఆనందించే అవకాశం పాటకి ఉంటుందన్నారు. మంచి పాటలు వింటే ఎవరికైన స్టెప్ వేయాలనిపిస్తుందని, మా ఇంట్లో కూడా కళాకారులు ఉన్నారని, మా నాన్న కూడా ఒక నటుడు, గాయకులు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారసత్వంగా మాకు కళాభిమానులుగా మారడం జరిగిందని అన్నారు. నాకు ఇష్టమైన గాయకులలో సుశీల ఒకరని ఆమె అంటే ఆమె గానం అంటే ఎంతో ఇష్టమని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికలా ఉంటుందని నేను ఊహించలేదని, నేను ఊహించిన దానికంటే ఎక్కువగానే కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారన్నారు. నిజామాబాద్ కళాకారుల ప్రదర్శనకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు. తదితరులు పాల్గొన్నారు.

