జానపదం అంటే జనపదం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జానపదం అంటే జనపదం అని, ప్రస్తుత కాలంలో జాన పదానికి ఎంతో ఆదరణ పెరిగిందని, నిజామాబాద్ లో కళాకారుల కళ అద్భుతమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో న్యూ అంబేద్కర్ భవన్ లో నిజాంబాద్ సంస్కృతి కళావేదిక అధ్యక్షులు సిర్ప లింగం ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు 2025 ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కళాకారులు, పాడిన పాటలు, చిన్నారులు...