24 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్రమ వడ్డీ వ్యాపారంపై కొరడా

Must read

📰 Generate e-Paper Clip

  • కట్టలకొద్ది కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు
  • కోట్ల విలు విలువైన చెక్కులు
  • కోటికి పైగా నగదు స్వాధీనం

 

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారo పోలీస్ బాస్ కొరడా జూలిపించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పులకు సామాన్యుల నుంచి మొదలుకొని చిరు అధిక మొత్తంలో వడ్డీలు,బారు వడ్డీలు, చక్ర వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  కన్నెర్ర చేశారు. పోలీస్ బాస్ ఆదేశాలతో శనివారం తెల్లవారుజాము నుంచి నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ సభ్యుల పరిధిలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు సోదలతో విరుచుకుపడ్డారు. వ్యాపారులను నిద్ర నుంచి లేపి పిల్లలు కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో  కట్టల కొద్ది ప్రామిసరీ నోట్లు, రిజిస్టర్ సేల్స్ డీడ్లతోపాటు, చెక్కులను, నగదును  స్వాధీనం చేసుకున్నారు…

Crackdown on illegal usury business

అక్రమ వడ్డీ, అధిక వడ్డీ వ్యాపారుల పై పోలీసుల మెరుపు దాడులు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విస్తృత స్థాయిలో దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, రిజిస్ట్రేషన్ సైతం లేకుండా అనేకమంది అక్రమంగా ఫైనాన్స్ లు ఏర్పటూ చేసి  అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరిపారు. సామన్య పేద కుటుంబాలకు చెందిన వారి అవసరాలను ఆసరాగా చేసుకొని , ఫైనాన్స్ పేరుతో వారి వద్ద నుండి అధిక వడ్డీలు పసూలు చేస్తూ వీరిని ఆర్ధికంగా మరింత ఇబ్బందులకు గురి చేస్తున, ఈ అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా * నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, హెచ్చరించారు.

Crackdown on illegal usury business

  • పోలీస్ దాడులలో లభ్యమైన పూర్తి  వివరాలు

నిజామాబాద్ లో 137 చెక్కులు వాటి విలువ 10,14,11,370 గా గుర్తించారు. ఆర్మూర్ లో  62 చెక్కులను స్వాధీనం చేసుకోగా వాటి  విలువ రూ.30,36,000 లుగాబోధనలో  ఇలాంటి చెక్కులు స్వాధీనం చేసుకోలేదు. నిజామాబాదులో170 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ.7,10,73,870, ఆర్మూర్ లో 324  బాండ్ల విలువ 4,97,10,000 కాగా, బోధన్  లో దొరకలేదు. నిజామాబాదులో   బాండ్ పేపర్లు దొరకలేదు. ఆర్మూర్ లో 49 దొరకగా వాటి విలువ రూ.1,85,30,500, బోధన్లో బాండ్లు దొరకలేదు. నిజామాబాద్ డివిజన్లో ల్యాండ్ డాక్యుమెంట్స 99, ఆర్మూర్ లో 05 బోధన్ లో  దొరకలేదు. నిజామాబాదులో నగదు మొత్తం రూ. 1,21,92,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారులపై కేసుల నమోదు తో పాటు మనీలాండరింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

Crackdown on illegal usury business

More articles

Latest article