- ఐదు ఎకరాల్లో ఈత చెట్లు దగ్ధం
- రూ.2 లక్షల ఆస్తి నష్టం
సాలూర, బతుకమ్మ: సాలూరు మండలం తగ్గేల్లి గ్రామ శివారులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు సుమారు ఐదు ఎకరాలల్లో నాటి ఉన్న ఈత చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
- రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం..
ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. తమ జీవనాధారం అయిన ఈత చెట్లు నాశనమవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని ఈత కార్మికుడు మల్లెపూల లక్ష్మణ్ కన్నీటి గట్టుతో మీడియాకు వివరించారు. “ఏడు తరాలుగా మేము ఈత చెట్లనే ఆధారంగా జీవిస్తున్నాం. ఇవి కాలిపోవడంతో మాకు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది అని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

- ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి..
బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు సబ్ కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు కూడా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
