24 C
Hyderabad
Sunday, August 2, 2026

మొరం తరలిస్తున్న వాహన యజమానికి జరిమాన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : తాళ్ళ రాంపూర్ గ్రామం,బోడగుట్ట ప్రాంత లో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరము తవ్వుచున్న TATA HITACHI EX-140 పోక్లేను, మరియు  ట్రాక్టర్ No. TS 16 FH 6828,  TS 35 F 8125 నెంబర్ గల 2 ట్రాక్టర్ల లను ఏర్గట్ల మండల రెవిన్యూ సిబ్బంది   పట్టుకోవడము జరిగినది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరం మట్టిని తరలిస్తున్న పోక్లేను,2 ట్రాక్టర్ల కు జెసిబి, పోక్లేను యజమాని బత్తుల రమణయ్యకు పోక్లేనుకు, 20000/- 2 ట్రాక్టర్ల కు. 10000/- మొత్తము రూ. 30000/- జరిమానా విదించి వాహనములు విడుదల చేయడం జరిగిందని మండల తాసిల్దార్ తెలిపారు. ఏర్గట్ల మండలము లో ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరం,మట్టినిగాని, అలాగే ఇసుకను గాని రవాణా చేసినట్లు అయితే చట్ట ప్రకారము వాహనములు సీజు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని మండల తాసిల్దార్ జె మల్లయ్య తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఆర్ఐ సదానంద్,మధు మండల సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article