- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
- ఈనెల 25 తో ముగియనున్న సర్వే
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణా రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారని అన్నారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు , సూచనలను అందించాల్సింగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
