రుద్రూర్, బతుకమ్మ : జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో మంగళవారం ఆవులు, గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో 94 పాడి పశువులకు టీకాలు వేయడం జరిగిందని పేర్కొన్నారు.
