. . . మద్నూర్‌లో కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జుక్కల్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డోంగ్లీ ఎమ్మార్వో రంజిత్ కుమార్‌తో పాటు డోంగ్లీ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక అండగా నిలుస్తూ కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై ఆనందం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
