27.1 C
Hyderabad

జర్నలిస్టు విజయ్ కుటుంబానికి ఆర్థిక సహాయం 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్టు విజయ్ కుమార్ కుటుంబానికి అక్షర విజేత యజమాన్యం ఆర్థిక సహాయం అందజేసింది.  దివంగత విజయ్ కుమార్ నివాసంలో ఆదివారం జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. అక్షర విజేత సంస్థ తరపున రూ.15 వేలను నిజామాబాద్ జిల్లా ప్రతినిధి షేక్ హైమద్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతడ్పుల రామ కృష్ణ,కోశాధికారి కోర్న సందీప్,జర్నలిస్టు వాగ్మారే సుభాష్ లు ఉన్నారు.

More articles

Latest article