26.2 C
Hyderabad
Monday, August 3, 2026

క్రీడాకారునికి రూ.5వేల ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ పొందుతున్న ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన హేమంత్ క్రీడాకారుడు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంలో హేమంత్ వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.గంగాధర్ రెడ్డి రూ.5,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు ఊషూ క్రీడా జిల్లా అధ్యక్షులు ఏలేటి గంగారెడ్డి, నునుగొండ అంజయ్య, మోతె గంగారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, సంజీవ్ థామస్, గోపి రాము, గద్దల గంగారాం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article