29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిబంధనల ప్రకారం ఫైళ్ల నిర్వాహణ జరగాలి

Must read

📰 Generate e-Paper Clip

ఆల్ఫోర్స్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ళ నిర్వహణ, కళాశాల నిర్వహణ జరగాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమాలపూడి రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను పరిసరాలను పరిశీలించారు కళాశాల కార్యాలయం సిబ్బంది కళాశాల యాజమాన్యంతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు ప్రతి కార్యాలయ రిజిస్టర్లన్నీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు దొర్లకుండా చూడాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని  జాగ్రత్తగా ప్రతి అంశం  పై శ్రద్ధ  వహించాలని అన్నారు. విద్యార్థుల డేటాను సరిచేసుకునేందుకు సబ్జెక్టులు మార్చుకునేందుకు, ఫోటో సంతకం తప్పిదం  సరిదిద్దుకోవడానికి ఇంటర్ బోర్డు మరో అవకాశం ఇచ్చిందని, డేటాను సరి చేసి కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు నిబంధనలను అతిక్రమించిన  ఏ కళాశాలపై అయిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  కళాశాల ఆవరణ తో పాటు, తరగతి గదులను, ప్రయోగశాలలను, కనీసంఅవసరాల కల్పనపై పర్యవేక్షణ చేశారు.  నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ళ నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు, పరీక్ష ఫీజుల వసూలు, ఇతర అన్ని రిజిస్టర్ లను తనిఖీ చేశారు.  ఈ సమావేశంలో ప్రిన్సిపల్, సిబ్బంది, అధ్యాపకులు హాజరయ్యారు.

Files should be maintained as per rules

More articles

Latest article