28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విహారయాత్రకు పాలెం విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని తీగల వంతెన, మానేరు డ్యాం, రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, వరంగల్ ఫోర్ట్, భద్రకాళి దేవాలయము, వేయి స్తంభాల గుడి తదితర ప్రాంతాలను సందర్శించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి వేణుగోపాలరావు అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకం లోని అంశాలు చారిత్రక విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్,రాజేందర్ రాజేశ్వరి, మమత, సైఫ్ అలీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Palm students on vacation

More articles

Latest article