విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి

0 12,240

 

. . . విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం పై స్థానికుల ఆగ్రహం

 

మేడ్చల్, బతుకమ్మ :

 

విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి టెలికాం కాలనీ లో చోటు చేసుకుంది. మేడ్చల్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టెలికాం కాలనీలో సందీప్ తన భార్య శ్వేత, కూతురు రితిక తో నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి ఎదుట ఉన్న చెట్టు ఎక్కడ తమ కారు మీద పడుతుందోనని రాత్రి రెండు గంటల ప్రాంతంలో సందీప్ కారును వెనక్కి తీసేందుకు యత్నించాడు. అదే టైంలో ఆయన కూతురు రితిక బయటికి వచ్చి తెగి పడిన కరెంట్ వైర్ పై పడిపోయింది. ఆమెను లేపేందుకు సందీప్ భార్య శ్వేత రాగా ఇద్దరూ కరెంట్ షాక్ కు గురయ్యారు. కారులో నుంచి దిగిన సందీప్ భార్యను పక్కకు జరిపి కూతురిని రక్షించే క్రమంలో అతనూ కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో సందీప్, ఆయన కూతురు రితిక అక్కడిక్కడే మృతి చెందగా భార్య శ్వేతకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సహాయం కోసం విద్యుత్ శాఖ ఎమర్జెన్సీ నంబర్ లకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని కాలనీ వాసులు ఆరోపించారు. వర్షాకాలం రాకముందు విద్యుత్ అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.