27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి

Must read

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ  : రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందారు. ఈఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చౌరస్తా వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన మచ్చేందర్ (48), కూతురు మైత్రి (20) వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. మైత్రిని బస్టాప్ దింపేందకు బైక్ పై వెళ్తుండగా.. చౌరస్తాలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వీరి బైక్ ను ఓ ట్యాంకర్ ఢీకొంది. ఈప్రమాదంలో మచ్చేందర్, మైత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article