ఆదిలాబాద్ పట్టణంలో ఘటన
ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడిన దుండగులు.. సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో మెషిన్‌ను కట్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి… విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియపరిచారు. అందులో నగదు ఎంత ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
