- రోడ్డుపై నిలిచి ఉన్న కంటైనర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం
- ముగ్గురి దుర్మరణం
- ట్రాఫిక్ సేప్టి మేజర్స్ లేకపోవడంతోనే ప్రమాదం
బతుకమ్మ, బిచ్కుంద : బుధవారం రాత్రి జాతీయ రహదారి 161 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం జగన్నాథపల్లి శివారులోని హైవేపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన నవీన్ (22), జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనగంటి వెంకట్ (21), మంగళి గణేష్ (19) లు పెద్ద కోడప్గల్ నుండి బిచ్కుంద వైపు బైక్ పై వస్తుండగా జగన్నాథపల్లి శివారులోని 161 వ జాతీయ రహదారిపై నిలిచిఉన్న కంటైనర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాధంలో నవీన్, వెంకట్ అక్కడికక్కడే మృతిచెందగా గణేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- జాతీయ రహదారిపై ట్రాఫిక్ సెప్టీ మేజర్స్ లేకనే ప్రమాదం..
జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందడం స్థానికంగా కలకలం రేపింది. హైవే పై కంటైనర్ లారీ టైర్లు పంచర్ కావడంతో దానిని పక్కకు జరిపి మరమ్మత్తులు చేయలేదు. సరికదా వాహనాల ట్రాఫిక్ ను క్లీయర్ చేయడానికి కుడా ఎలాంటి సేప్టీ మేజర్స్ వాడలేదు. దానితో యువకులు అతి వేగంగా బైక్ ను చీకటిలో కంటైనర్ ను వెనుకనుంచి ఢీకోట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ క్లీయరెన్స్ సమయంలో రేడియం గుర్తులు కనిపించేలా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలననే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
198
