పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ కు సన్మానం

0 17,894

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జూన్ 30న ఉద్యోగ విరమణ చేసిన నిజామాబాద్ జిల్లా పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు, బర్కత్పుర జియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోడి కృపాల్ సింగ్ ను గురువారం జియుపిఎస్ పూలాంగ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ సౌత్ మండలానికి చెందిన మండల విద్యాధికారి సాయ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ విద్యార్థులకు అందించిన సేవలను గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘం నేతగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Tribute to PRTU Telangana District President Kripal Singh

Leave A Reply

Your email address will not be published.